Friday, June 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ కార్మికుల రిలే దీక్షలు

మున్సిపల్‌ కార్మికుల రిలే దీక్షలు

- Advertisement -

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
నవతెలంగాణ- విలేకరులు

తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌(సీఐటీయూ) యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట దీక్షలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన రెండ్రోజుల దీక్షలను యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లుతో కలిసి సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. జమ్మికుంటలో చేపట్టిన దీక్షకు మున్సిపల్‌ చైర్మెన్‌ మొలుగు ప్రశాంత్‌ కుమార్‌ దిలీప్‌ మద్దతు తెలిపారు. హుజురాబాద్‌, సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ దీక్షలు ప్రారంభించారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికుల దీక్షలను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య ప్రారంభించారు. చండూరు, చిట్యాల మున్సిపల్‌ కార్యాలయాల వద్ద రిలే దీక్షలను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి.సలీం ప్రారంభించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షలను మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -