నవతెలంగాణ-నాగార్జునసాగర్
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత నిర్వహణపై మంగళవారం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు డ్యాం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక విజయ విహార్ అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతపై ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, అదనంగా తీసుకోవలసిన చర్యలపై డ్యాం ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. అనంతరం జెన్కో కార్యాలయంలో జెన్కో ఉన్నత స్థాయి అధికారులతోనూ చర్చించారు.
పూర్తిస్థాయి నివేదికను ఇంటలిజెన్స్ ఉన్నత స్థాయి అధికారులకు పంపనున్నట్టు తెలిపారు. ఇంటలిజెన్స్ బ్యూరో డీఎస్పీ హీరాలాల్ నాయుడు, సాగర్ డ్యాం సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జునరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సాగర్ డ్యాం ఈఈ సీతారాం, డీఈ అశోక్, డ్యాం భద్రత అధికారులు శ్రీనివాసరావు, ఇంటలిజెన్స్ బ్యూరో సీఐ సునీల్ కుమార్, ఏఈలు సత్యనారాయణ, విజయ్ పాల్గొన్నారు.
సాగర్ డ్యాం భద్రతపై ఇంటలిజెన్స్ అధికారుల సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



