నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోరు బావి చెడిపోవడంతో గ్రామ అభివృద్ధి కమిటీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాఠశాలలో గురువారం బోరు బావి ఒక్కసారిగా చెడి పోయింది. అసలే మండే ఎండలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమస్య తీవ్రతను ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ, స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అధ్యక్షులు, సభ్యులు పాఠశాలకు చేరుకొని మరమ్మత్తులు చేపట్టారు. మోటార్ కాలిపోవడం, బోరు గుంతలో ఇరుక్కు పోవడంతో ఆగ మేఘాల మీద కొత్త మోటార్ ను ఖరీదు చేసి శుక్రవారం బిగింపచేశారు. సుమారు రూ.30వేలు వెచ్చించి నీటి సమస్యను పరిష్కరించారు. కొత్త బోరుబావిని కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, ఉపాధ్యక్షులు రాధారపు గంగాధర్, సభ్యులు ప్రారంభించారు. పాఠశాల సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే పనులు చేపట్టినందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణశ్రీ, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
స్పందించిన వీడీసీ..నీటి సమస్యకు పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



