- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. యువతకు ఆయన ఆదర్శప్రాయ నాయకుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగు మురళీ, రవీందర్ రెడ్డి, రవి, శ్రీనివాస్, వేణు, నరేష్, సంపత్, నవీన్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



