Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సింగరేణి కాలరీస్ సంస్థ నిధులతో దుర్గాబాయి మహిళా ప్రాంగణం నిర్మాణం

సింగరేణి కాలరీస్ సంస్థ నిధులతో దుర్గాబాయి మహిళా ప్రాంగణం నిర్మాణం

- Advertisement -

నవతెలంగాణఆలేరు టౌను 
సింగరేణి కాలరీస్ కేటాయించిన నిధులతో, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం నిర్మాణం జరిగిందని, మహిళా శిశు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా భవనం ప్రారంభించనున్నట్లు ఆర్డీవో నాగిరెడ్డి చెప్పారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సిడిపిఓ స్వరాజ్యంతో కలిసి ఆయన మాట్లాడుతూ మహిళా ప్రాంగణం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉందని, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు పట్టణంలో మహిళా ప్రాంగణ భవనం, సింగరేణి కాలరీస్ సంస్థ కేటాయించిన 50 లక్షల రూపాయలతో  నిర్మించబడిందని తెలియజేశారు.

 సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్మన్  బండ్రు శోభారాణి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. మహిళా ప్రాంగణం ప్రారంభంతోపాటు, జి ఆర్ సి సెంటర్, మహిళా శిక్షణ తరగతుల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డిఆర్డిఓ విభాగం భాగస్వామ్యం అవుతుంది అన్నారు. మహిళలచే స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తారు.

అంగన్వాడీ టీచర్లు, ఉమెన్ హ్యాండ్ చైల్డ్ పర్సన్స్  విభాగం నుండి, మహిళా సంఘం సభ్యులు హాజరుకానున్నట్లు తెలియజేశారు. తెలంగాణ మహిళ కో-ఆపరేటివ్ చైర్మన్  బండ్రు శోభారాణి కంట్రోల్లో మహిళా అభివృద్ధి  భవనాలు ఉంటాయన్నారు. మహిళా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ జిల్లా అధికారిని రమణ, ఆలేరు సిడిపిఓ ప్రాజెక్టు అధికారిని స్వరాజ్యం, సూపర్వైజర్ అండాలు, ఏపిఎం సత్యనారాయణరెడ్డి, పి ఆర్ ఏ ఈ నవ్య, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -