హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. బుధవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై, హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ,’మా సినిమా జోనర్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్తున్నాం. రామ్ మిరియాల మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘మా అందరికీ ఇదొక బ్యూటీఫుల్ ప్రాజెక్ట్. రెండు పాటలు ఇప్పటికే కంప్లీట్ చేశాం. పాటలు చాలా బాగా వచ్చాయి’ అని మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల చెప్పారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్‌ఎస్ కాంచి, సురేష్ గురు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ – అరవింద్ ములె, ఎడిటర్ – నరేష్ అడుప, డీవోపీ – సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ – రామ్ మిరియాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నవీన్ రెడ్డి.
ఆద్యంతం వినోదభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



