తమిళనాడు విశ్వాస ఓటుపై
సీబీఐ దర్యాప్తు పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ : తమిళనాడు అసెంబ్లీలో మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో అవకతవకలు, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్న పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. విశ్వాస పరీక్షలో రెబల్ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని, కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చారని, వీటిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, అప్పటివరకూ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన కె.కె.రమేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అరోపణలకు ఎలాంటి విశ్వసనీయమైన, స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవంటూ ఈ పిటిషన్ను విచారించడానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ తిరస్కరించింది. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన కారణం తమకు కనిపించడం లేదని పేర్కొంది.
అస్పష్ట ఆరోపణలు
- Advertisement -
- Advertisement -



