- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
కంఠాలి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ , గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్యసాహసాలకు ప్రతీక అని అన్నారు. చత్రపతి శివాజీ ప్రజల హక్కుల కోసం పోరాడి హిందవ స్వరాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు అని తెలిపారు. చత్రపతి పరిపాలనలో న్యాయం, ధర్మం, సమానత్వం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. యువత ఆయన జీవితం నుండి స్పూర్తి పొందాలని యువకులకు, గ్రామస్తులకు, గ్రామ పెద్దలు సూచించారు.
- Advertisement -



