నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామానికి చెందిన యువకుడు సుంకరి రాము సీఎం కప్ లో భాగంగా రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగు పందెం పోటికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా యువకున్ని తండ్రి మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న మాట్లాడుతూ.. ఇటీవలే జిల్లాస్థాయిలో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు.
చిన్ననాటి నుండి ఆటల పోటీలపై మక్కువ చూపిన తన కుమారుడు నైపుణ్యం సాధించేందుకు పలు రాష్ట్రాలలో నిర్వహించిన పోటీలలో పాల్గొన్నాడని తెలిపారు. అక్కడ కూడా పలు పథకాలు సాధించాడని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత యువకులకు ప్రోత్సాహం అందిస్తే మట్టిలో మాణిక్యాలు వెతికిపట్టడం సులువుగా ఉంటుందని అన్నారు. సీఎం కప్ పోటీలతో గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో సహకారం జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందుకే గ్రామీణ ప్రాంతాలలో యువకులు ముందుకు వచ్చి తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి చక్కటి అవకాశం లభించిందని అన్నారు.



