Thursday, February 19, 2026
E-PAPER
Homeజిల్లాలుఇండ్ల ఇండ్ల నిర్మాణాల ప్రగతి పరిశీలన 

ఇండ్ల ఇండ్ల నిర్మాణాల ప్రగతి పరిశీలన 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగాన్ని పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. గతంలోనే  మార్కౌట్ పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు కూడా పిల్లర్లు, పునాదుల పనులను మొదలు పెట్టాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారికి మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణాలను త్వరగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. గతంలోని నిర్మాణాలను చేపట్టి స్లాబుల వరకు పూర్తయిన ఇండ్లకు సంబంధించి మిగతా పనులను కూడా పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకారం అందిస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శి శివ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -