ఆర్యా హీరోగా, పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్, విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
నిర్మాత మురుకుంట్ల అరవింద్ మాట్లాడుతూ, ‘నాకు సినిమాలంటే చాలా ఆసక్తి, నా కల మా అబ్బాయి ద్వారా తీరడం చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతమైన కథ ఇది. జూలైలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. ‘డైరెక్టర్ కృష్ణకి మా అబ్బాయి హీరో పాత్రకి సరిపోతాడంటేనే తీసుకోమని చెప్పాం. ఒకరోజు డెమో షూట్ చేశారు. 100% తను ఒక మంచి నటుడని అనిపించాకే తీసుకున్నారు’ అని నిర్మాత విజయ భారతి చెప్పారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ,’ఇదొక యాక్షన్ థ్రిల్లర్. టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది’ అని తెలిపారు. ‘నాకు ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణకి ధన్యవాదాలు’ అని హీరో ఆర్యా చెప్పారు.
నయా యాక్షన్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



