Friday, February 20, 2026
E-PAPER
Homeమానవికూల్‌ డ్రింక్స్‌ తాగుతున్నారా?

కూల్‌ డ్రింక్స్‌ తాగుతున్నారా?

- Advertisement -

సమ్మర్‌, వింటర్‌ తేడా లేదు.. వివిధ రకాల కూల్‌ డ్రింక్స్‌ చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇక ఇండ్లల్లో పెద్దపెద్ద బాటిళ్లు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టుకొని తాగేస్తున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావనీ, ఇవి తాగితే వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఫ్యాటీ లివర్‌ : కూల్‌డ్రింక్స్‌లో ప్రాసెస్‌ చేసిన షుగర్‌ ఉంటుంది. ఈ షుగర్‌లో ముఖ్యంగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. గ్లూకోజ్‌ని శరీర కణాలు ఈజీగా అబ్జార్బ్‌ చేసుకోగలవు. కానీ, ఫ్రక్టోజ్‌ని మాత్రం కణాలు జీర్ణం చేసుకోలేవు. కాలేయం మాత్రమే దీన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగినప్పుడు ఫ్రక్టోజ్‌ ఓవర్‌లోడ్‌ అవుతుంది. దీంతో కాలేయం ఫ్రక్టోజ్‌ కణాలను కొవ్వుగా మారుస్తుంది. అయితే, ఈ కొవ్వు కాలేయంపై పేరుకుపోయే కొద్ది సమయంలోనే ఫ్యాటీ లివర్‌ వ్యాధికి దారితీస్తుంది.
బరువు పెరగడం : కూల్‌ డ్రింక్స్‌ తాగితే బరువు పెరుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సోడాలు, కూల్‌ డ్రింక్స్‌లో షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఒక సాధారణ కోకా కోలా బాటిల్‌లో దాదాపు 8 టేబుల్‌ స్పూన్ల షుగర్‌ ఉంటుందట. అంటే, వీటిని తాగినప్పుడు సంతృప్తిగా ఉంటుంది కానీ శరీరానికి ఎలాంటి పోషకాలను అందించవు. వీటిని ఎక్కువగా తాగితే బాడీలో షుగర్‌ కంటెంట్‌ పేరుకుపోయి కొవ్వు కణాలుగా మారతాయి. క్రమంగా బరువు పెరిగేందుకు కారణమవుతుంది.

దంత క్షయం : సాఫ్ట్‌ డ్రింక్స్‌ మన దంతాలకు చాలా హానికరం. సోడాలలో పాస్ఫారిక్‌ యాసిడ్‌, కార్బోనిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో దంతాలపై ఉండే కీలకమైన ఎనామిల్‌ని క్షీణింపజేస్తాయి. పైగా, నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది క్యావిటీలకు కారణమవుతాయి. దీంతో దంతక్షయానికి దారితీసి పంటినొప్పి కలుగుతుంది.
డయాబెటిస్‌ రిస్క్‌ : కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధి ముప్పు పెరుగుతుంది. సాఫ్ట్‌ డ్రింక్స్‌లో ఉండే ఫ్రక్టోజ్‌ కంటెంట్‌ ఇన్సులిన్‌ నిరోధకతకు కారణమవుతుంది. రక్తంలో పేరుకుపోయిన గ్లూకోజ్‌ను శరీర కణాలకు ఇన్సులిన్‌ హార్మోన్‌ చేరుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, గ్లూకోజ్‌ కణాలు ఓవర్‌లోడ్‌ అయినప్పుడు శరీర కణాలపై ఇన్సులిన్‌ ప్రభావం చూపించదు. దీంతో పాంక్రియాస్‌ ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నించడంతో రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -