Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు యూరియా సరఫరాపై ఎలాంటి ఆందోళన వద్దు

రైతులు యూరియా సరఫరాపై ఎలాంటి ఆందోళన వద్దు

- Advertisement -

–  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రైతులు యూరియా కొరతపై ఎలాంటి సందేహాలు, ఆందోళనలు చెందవద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తున్నదని, రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంచిందన్నారు.

రైతులు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారం ఆధారంగా వ్యవహరించాలని సూచించారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా సొసైటీ చైర్మన్ లు సకాలంలో యూరియాని అందుబాటులో ఉంచి, పారదర్శకంగా యూరియా సరఫరా చేయాలని తెలిపారు. ప్రతిపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా కావాలని ప్రజా ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ప్రతిపక్షాలు ఇకనైనా రైతులను రెచ్చగెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు డాక్టర్ మురళి, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్, కమ్మర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సల్లూరి గణేష్, ఉప్లూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, చౌట్ పల్లి అధ్యక్షుడు రవీందర్, బషీరాబాద్ అధ్యక్షుడు భూమేశ్వర్, యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు శైలేందర్, నాయకులు కుంట ఆనంద్, నిమ్మ రాజేంద్రప్రసాద్, లింగారెడ్డి, గణేష్, సాధుల్లా, పూజారి శేఖర్, మొకిమ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -