నవతెలంగాణ- డిచ్ పల్లి
వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, హార్వెస్టర్ కోత యంత్రం పనిముట్లు కొనుగోలు చేయుటకు రుణాలను అందజేస్తామని, జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాట్లు చేసుకోవడానికి ముందుకు రావాలని డీఆర్డీఓ, డిఅర్డిఎ పీడీ చందర్ నాయక్ అన్నారు.మంగళవారం జిల్లా మహిళ సహకార సమాఖ్య సమావేశం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులోని ట్రైజం సెంటర్(టీటీడిసి)లో జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాడీఆర్డిఓ పీడీ చందర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఎదైన వ్యాపారం లో ఆదాయం వచ్చేటట్లు చుసుకుంటు ఇతర వ్యాపారాలు చేసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజీ రూణలను, వీఓలతో, ఎంఎస్ 2024 మార్చి 31 వరకు టార్గెట్ నిమిత్తం రూణలను ప్రతి సభ్యులు తీసుకోవాలన్నారు. స్త్రీ నిధిలో సోలార్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నమన్నారు. ఇలాంటి అవకాశాలను ఇతరులకు వివరించి వారికి లాబ్ది చేకురేల కృషి చేయాలని సూచించారు.ఈసమావేశంలో ఎపీడీ టి.మధుసూదన్, డీపీయం ఎన్.శ్రీనివాస్, ఎపియం సరోజిని, డీపీయం సంధ్యారాణి, డీపీయం నీలిమా, సాయిలు, మారుతి, రాచయ్య, మహిళా సమాఖ్య సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.