రైతుల పాలిట శాపంగా మారిన మోచింగ్ తుఫాన్

నవతెలంగాణ-గోవిందరావుపేట

మోవ్చింగ్ తుఫాన్ రైతుల పాలిట శాపంగా మారింది. మంగళవారం మండల వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో వర్షం విస్తారంగా కురిసింది. రైతులు కోసిన ధాన్యాన్ని ఆరబోసుకోలేక నానా తంటాలు పడ్డారు. ఒక దశలో రాసులుగా పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు బావురుమన్నారు. కోసిన వరి పనులు తడిసిపోవడంతో ఉసురుమన్నారు. కోసేందుకు సిద్ధంగా ఉన్న వరి పంట పొలాలు నేల కరుచుకుని పడిపోవడంతో రైతులు కుదేలయిపోయారు. మరో రెండు రోజులపాటు తుఫాన్ ప్రభావం ఉంటుందన్న వార్త కథనాలతో రైతులు దిగాలు పడుతున్నారు. మరో రెండు రోజులు ఏ కదా వర్షం కురిస్తే కోయకుండానే ధాన్యం వరి గొలుసులోనే మొలకెత్తుతుందని  ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన దాన్యం రాశులపై పూర్తిస్థాయిలో కప్పేందుకు టార్పాలిన్స్ లేవని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల వారు రైతులకు సరిపడా తార్పాలియన్స్ అందుబాటులో ఉంచాలని రైతుల కోరుతున్నారు.
Spread the love