- Advertisement -
దండు కడితే మిడతలు
ప్రపంచాన్నే వనికిస్తాయి
బారు కడితే చీమలు
పాములనే వధిస్తాయి
పెన వేసుకున్న గడ్డి పోచలు
ఏనుగులనే బంధిస్తాయి
ఓ… మనిషి.. తెలుసుకో
నీవు గర్జిస్తే
రాజ్యం గజగజ వనకాల్సిందే
నిలదీస్తే పాలకులు
నీ ముందు మోకరిల్ల వలసిందే
ప్రభుత్వాలు ఏవైనా
నీకు
సేవ చేయడానికే…కానీ
స్వారీ
చేయడానికి కాదు
ప్రభువులెవ్వరూ..లేరిక్కడ
ప్రజాస్వామిక
వ్యవస్థలో
ప్రజలే ప్రభువులు
ఓ… నా దేశ..పౌరుల్లారా
ప్రజలెప్పుడూ
ప్రవహించే నదిలా ఉండాలి
గనీభవించిన శిల లా కాదు
పౌర చైతన్యమే కదా !
ప్రజాస్వామ్యానికి
శ్రీరామ రక్ష
.. బత్తుల శ్రీనివాసులు
- Advertisement -

