- Advertisement -
ఎల్ ఆల్టో: బోలివీయా అధ్యక్షుడు రోడ్రిగ్ పాజ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై భద్రతాబలగాలు విరుచుకుపడుతున్నాయి. సుమారు 43 రోజులకుపైగా ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ.. రహదారి దిగ్బంధనాలు, ర్యాలీలకు భయపడిన రోడ్రిగో పాజ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన విషయం విదితమే. ఆందోళనకారుల మెడలు వంచేలా పోలీసులను అధ్యక్ష భవనం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఆదివారం శాంతియుతంగా నిరసనలకు దిగితే..తమను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
- Advertisement -



