అందరూ ఐక్యమత్యంతో పోరాడాలి, అండగా ఉంటాం : బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు హనుమాన్ నగర్ వాసులకు తానే స్వయంగా పట్టాలు తీసుకొచ్చి ఇస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హనుమాన్ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతంలో 50 ఏండ్ల నుంచి ప్రజల నివసిస్తున్నారని, ఇప్పుడు అధికారులు వచ్చి మూసీ ప్రాజెక్టు పేరుతో ఖాళీ చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూల్చడమే తప్ప నిర్మించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే హనుమాన్ నగర్ వాసులకు పట్టాలిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



