రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు
ఓవర్‌లోడ్ పై ప్రత్యేక డ్రైవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వంద వాహనాలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. భారీగా కేసులు నమోదు చేశారు. తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అన్ని జిల్లాల డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు, జిల్లా రవాణా శాఖ అధికారులు, ఎంవీఐ లు, ఏఎమ్‌వీఐలు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పరిరక్షించడం కోసం ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో నిర్దేశిత పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు 100 వాహనాలను సీజ్ చేసారు.అధిక లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతినడం, వంతెనలపై అదనపు ఒత్తిడి పడడం, ప్రమాదాల ముప్పు పెరగడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అందువల్ల గనులు, క్వారీలు, రీచ్‌లు, పారిశ్రామిక సంస్థలు, రవాణాదారులు మరియు వాహన యజమానులు అనుమతించిన బరువు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో వాహనాలను నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక లోడ్ వేసే సంబంధిత క్వారీలు, రీచ్ లు, కంపెనీలకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఓవర్ లోడ్ తో రెండవ సారి పట్టు బడితే పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
100 వాహనాలు సీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



