Saturday, February 21, 2026
E-PAPER
Homeజిల్లాలుశంకరంపల్లిలో పట్టపగలే జోరుగా మట్టి మాఫియా

శంకరంపల్లిలో పట్టపగలే జోరుగా మట్టి మాఫియా

- Advertisement -

-యథేచ్చగా ప్రకృతి సంపద లూటీ..
-మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారుల మౌనం..
-రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు..
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలం శంకరంపల్లి గ్రామపంచాయతీ శివారు ప్రాంతం మట్టి మాఫియాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా విలువైన మట్టి సంపద రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా తరలిపోతుంది. ఇంత జరుగుతున్న సంబంధిత మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏముందో అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి, వ్యవసాయ క్షేత్రాలలో,చెరువు శివారు ప్రాంతాలలోని మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ ల సహాయంతో దదేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా స్థానికులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం..
మట్టి తవ్వకాల వల్ల భూములు లోతుగా మారి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి. వర్షాకాలంలో నీరు నిలిచి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. భూగర్భజల మట్టం పడిపోతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల మౌనంపై అనుమానాలు..
అక్రమ తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులకు అండగా ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో మట్టి మాఫియా దర్జాగా వ్యాపారం చేస్తోంది.

ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం..
లీగల్ రాయల్టీ చెల్లింపులు లేకుండా మట్టి తరలింపులు జరగడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గాలిలో కలిసిపోతోంది. ప్రతి రోజు అనేక వాహనాలు అక్రమంగా మట్టి తరలిస్తుండటంతో ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లుతున్నట్లు అర్థమవుతుంది.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్..
మట్టి మాఫియా పై కేసులు నమోదు చేసి అక్రమ తవ్వకాల్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ పెంచాలని, సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -