Saturday, February 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగుండెలు పిండే వికృత నేరకాండ

గుండెలు పిండే వికృత నేరకాండ

- Advertisement -

అమెరికా న్యాయశాఖ జనవరి 30న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల చేసిన నాటి నుంచి ఆ దేశంలోనూ యూరప్‌లోనూ తీవ్ర అలజడి చెలరేగింది. 30 లక్షల ఇ-మెయిల్‌ సంభాషణలు, లక్షకు పైగా ఫొటోలు, వేయికి పైగా వీడియో క్లిప్పింగులతో కూడిన ఈ పత్రాల విడుదలతో ఘోరమైన నేరస్త చర్యలు బయటపడ్డాయి. అయితే ఈ ఘోరాల పర్వం మొత్తం ఎప్‌స్టీన్‌ పాత్ర చుట్టూనే తిప్పుతూ తనే లక్ష్యంగా చర్చ సాగుతున్నది. అయితే ఎప్‌స్టీన్‌ అమానుష దురంతాలు అతనేదో వంటరి వ్యక్తిగా చేసినవి కాదని సుస్పష్టమవుతూనే వుంది. ఒక వ్యవస్థీకృ త వాతా వరణంలోనే ఇవన్నీ జరిగాయి. ఈ తప్పులు దశాబ్దాల పాటు సాగుతూ వచ్చాయి. మొదట్లో 2008లో వ్యక్తిగత స్థాయి లో చేస్తూ వచ్చిన ఆరోపణలు ఉన్నత స్థాయిలో వారి నేరస్థ చర్యలపై దర్యాప్తుగా మారింది. తర్వాత ఆయన్ను అరెస్టు చేయడ ం, 2019లో ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.

1980లు, 90లలో అతను స్త్రీలనూ బాలికలనూ రిక్రూట్‌ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎప్‌స్టీన్‌ తన చెల్లెళ్ల ఫొటోలు దొంగిలించి, ఆ విషయాన్ని బయటపెడితే చంపుతానని బెదిరించినట్టు ఒక నటి ఎఫ్‌బిఐ గూఢచారి సంస్థకు చెప్పారు. 1998లో అతను వర్జిన్‌ దీవులలో లిటిల్‌ సెయింట్‌ జేమ్స్‌ దీవ్ని కొనుగోలు చేశాడు. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ దురంతాలలో ఇదే కేంద్ర బిందువుగా తయారైంది. అతనికి మసాజ్‌ సేవకురాలిగా మారనున్న మహిళ 2000 సంవత్సరంలోనే తాను సెక్స్‌ బానిసగా వున్నానని ప్రకటించింది.

తప్పించిన తొలి విచారణ
పద్నాలుగేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిందన్న కథనాలు వచ్చాక 2005 మార్చిలో పామ్‌ బీచ్‌లో దర్యాప్తు ప్రారంభమైంది. వ్యభిచారాన్ని నడిపిస్తున్నారన్న అధికారిక ఆరోపణతో ఎప్‌స్టీన్‌ను 2006 జులైలో అరెస్టు చేశారు. ఒక మైనర్‌ బాలికను వ్యభిచారం చేయవలసిందిగా అడిగినట్టు అతను ఫ్లోరిడా కోర్టులో నేరం అంగీకరించాడు. తర్వాత ఎప్‌స్టీన్‌ ‘ప్రేమ పూర్వక’ అభ్యర్థన తర్వాత అమెరికా ప్రభుత్వ న్యాయవాది అలెగ్జాండర్‌ అకోస్టా ఆమోదిం చడంతో ప్రభుత్వ ఆరోపణలు తప్పించుకుని 18 నెలల శిక్షతో బయటపడ్డాడు. 2011లో వర్జీనియా గుఫ్రే (అంతకు ముందు పేరు వర్జీనియా రాబర్ట్స్‌)˜ బహిరంగంగా బయటికొచ్చి ప్రిన్స్‌ ఆండ్రూతో వ్యభిచారం కోసం తనను పంపి నట్టు బయటపెట్టింది. 2018 నవంబర్‌లో మియామి హెరాల్డ్‌ ప్రచురించిన సిరీస్‌లో 2008 నాటి అభ్యర్థన వివ రాలు వెల్లడైనాయి. దాంతో ప్రజల దృష్టి, చట్టాల దృష్టి కూడా కేంద్రీకృతమైంది. 2019 జులై ఆరున ఎప్‌స్టీన్‌ న్యూ యార్క్‌లో అరెస్టయ్యాడు. మైనర్లను వినియోగించి, జాతీయ మానవ అక్రమ రవాణా చట్టం కింద నేరాలు, కుట్రలకు పాల్పడినట్టు కేసు వేశారు. 2019 ఆగస్టు 10న జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. దాన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు.

చనిపోయాక కూడా…
ఎప్‌స్టీన్‌ మరణానంతరం కూడా దీనిపై తెరపడలేదు. 2021 డిసెంబర్‌లో ఎప్‌స్టీన్‌కు అతి సన్నిహిత సహ చరుడు ఘిస్లానే మాక్స్‌వెల్‌కు మహిళల అక్రమ రవాణా నేరానికిగాను ఇరవై ఏళ్ల శిక్ష పడింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కోర్టు అతని క్లైంట్ల పేర్లు వారి వారి నిర్దిష్ట తప్పుల ఆరోపణలు లేకుండా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే వేయిమంది బాధితుల ఆరోపణలతో నిరసన ప్రజ్వరిల్లింది. ప్రజాస్ఫూర్తిగల పాత్రి కేయులు, ఇతర విమర్శకుల తక్షణ పరిశోధనల ఫలితంగా అమెరికా కాంగ్రెస్‌ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పారదర్శకత చట్టాన్ని ఆమోదించవలసి వచ్చింది. ఫలితంగా మరింత లోతైన దర్యాప్తు కథనాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ఇ-మెయిళ్లు, ఫోటోలు, వీడియో క్లిప్పులతో కూడిన భారీ భాండాగారంలో భాగం, అమెరికాలో శక్తివంతులైన అధికార శక్తుల ఆనుపానులన్నీ వాటిలో వున్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్‌ దేశాల వారూ వున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాదు. లారీ సమర్స్‌, పీటర్‌ మండే ల్సన్‌ వంటి విధాన శిల్పులు, ప్రతిఫలం తీసుకునే మేధావులు, బిల్‌గేట్స్‌, ఎలన్‌మస్క్‌, రిచర్డ్‌ బ్రాన్సన్‌ వంటి బడా వ్యాపారులూ వున్నారు. ఇన్ని రకాలైన సెలబ్రిటీలతో ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌ పని చేసిందంటే నిజంగా బుర్ర తిరిగిపోతుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ పేరే లక్ష సార్లకు పైగా వినిపిస్తుంది. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని ట్రంప్‌ను ఎప్‌స్టీన్‌ అభివర్ణిస్తాడు. ఇజ్రాయిల్‌ తోనూ ఇజ్రాయిల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌తోనూ ఎప్‌స్టీన్‌కు భద్రతాపరంగా సున్నితమైన సంబంధాలున్నాయి.

లక్షల సాక్ష్యాలు
ఎప్‌స్టీన్‌కు వున్న అత్యంత ఖరీదైన ఆస్తులలో ఒకటైన న్యూయార్క్‌ సౌధం నుంచి ఈ ఫైల్స్‌ పట్టుబడ్డాయి. చాలా పకడ్బందీ అయిన చోట వాటిని దాచిపెట్టారు. అయితే ఇప్పుడు న్యాయశాఖ ఆదేశాలతో వాటిని బయటపెట్టాక ఒక్కసారిగా కొంప మునిగినంతపనైంది. ఇంకా లక్షోపలక్షల సాక్ష్యాలు బయటకు రావలసి వుందనే అను కుంటున్నారు. న్యాయశాఖకు సంబంధించిన కాంగ్రెస్‌ కమిటీ తన బహిరంగ విచారణలలో అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బొందీని, అలాగే ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ను ప్రత్యేకంగా చీల్చి చెండాడింది. పారదర్శకతా చట్టం నిబం ధనలు పాటించనందుకు తప్పు పట్టింది.

కనుక ఈ మొత్తం విచారణ తీరుతెన్నులన్నింటినీ బట్టి చూస్తే కావాలని సాగదీసేందుకూ, దారుణ కృత్యాలనూ నేరపూరిత సంబంధాలనూ కప్పిపుచ్చేందుకూ ఉద్దేశపూర్వకం గానే ప్రయత్నం జరిగిందని స్పష్టమవు తుంది. అంతేగాక మొత్తం సత్యం బయటికి రాకుండా చేస్తున్నారనీ, కీలకమైన వ్యక్తిగత సమాచారాలు తొక్కిపడుతు న్నారనీ కూడా స్పష్టమవుతుంది. సాక్ష్యాలను వెల్లడించే క్రమంలో బాధితుల వివరాలు చెప్పడంలో కూడా బలీయమైన శక్తివంతులైన వారి సంగతులు వెల్లడి కాకుండా ఎంపిక చేసుకున్నట్టు వ్యవహరిస్తున్నారనీ తెలిసిపో తుంది. ప్రధాన మీడియా ఎప్‌స్టీన్‌ పైనే కేంద్రీకరిస్తున్నది. ఆ విధంగా చేయడంలో ఉద్దేశం ఆయన ఘోర నేరాలకు పాల్పడ్డం వెనక వున్న వ్యవస్థీకృత రక్షణలను, ప్రోత్సాహాలను మరుగుపరుస్తున్నది.

వివరంగా బయటికి వస్తున్నదాన్ని పైపైన చూసినా సరే ఈ క్రమపద్ధతి ఏమిటో తెలిసిపోతుంది. 150 ఏళ్ల కిందటనే కారల్‌ మార్క్స్‌ పారిశ్రామిక పెట్టుబడి పుట్టుక పైన రాసిన అధ్యాయం ముగింపులో ఇలా అంటారు: ”పెట్టు బడి అనేది నఖశిఖ పర్యంతం ప్రతి అణువూ నెత్తురుతో మురికితో తడిసి వుంటుంది.” దీనికి మద్దతునిచ్చే విధంగా పాదపీఠికలో కార్మిక నాయకుడైన టిజె డన్నింగ్‌ మాటలను ఉటంకిస్తాడు: కావలసినంత లాభం వస్తే పెట్టుబడి ఎంతకైనా తెగిస్తుంది. పదిశాతం వచ్చేట్టయితే అది ఎక్కడైనా వాలుతుంది. ఇరవై శాతం వస్తే ఆదుర్దా పెంచుతుంది. యాభై శాతం వస్తే సానుకూల సాహసం సమకూరుతుంది. అదే వందశాతంవస్తే మానవ చట్టాలన్నిటినీ తొక్కి పారేసేందుకు సిద్ధమైపోతుంది. 300 శాతం వస్తే గనక అది ఎంతటి నేరానికైనా పాల్పడేందుకు వెనుకాడే ప్రసక్తి వుండదు. తన యజమానిని ఉరి తీయడానికి కూడా సిద్ధమైపోతుంది.” ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బయట పెట్టిన కథనం చూస్తే మార్క్స్‌ వాదన ఎంత వాస్తవికమో అర్థమవుతుంది.

మానవత మృగ్యమైన తీరు
పెట్టుబడిదారీ విధానం ప్రస్తుత నయా ఉదారవాద అవతారం దాల్చేందుకు దాన్ని వెంటనంటి వుండే ఆశ్రిత పోకడలు అగాధమైన అసమానతలకూ నిరుద్యోగానికి దారితీస్తున్నాయి. ఇది సృష్టించిన ప్రమాదకరమైన నయా ఉదారవాద భావజాలం దాని ఆర్థిక నమూనాను దాటేసి ముందుకు పోతుంది. విపరీతమైన అసమానతల వల్ల వ్యాఖ్యా తలు చెబుతున్నట్టు ఎప్‌స్టీన్‌ బాపతు ప్రపంచ పీడక సంతతి పుట్టుకొచ్చారు. వీరు ఇతరులను ఆర్థికంగానూ ఇతరత్రా కూడా కొల్లగొడతారు. సాధారణ మానవతా విలువలను ఇంకే మాత్రం పట్టించుకోరు. వీరినే ఎలన్‌మస్క్‌ ”పని లేని పాత్రలు” అంటాడు. పాశ్చాత్య నాగరికతలో అతి ప్రాథమికమైన బలహీనత సహానుభూతి మాత్రమేనని తేల్చేస్తాడు.

ఈ బరితెగింపు, ఏమీకాదనే ధీమా వల్లనే వారు కనీసమైన జవాబుదారీతనం కూడా లేకుండా ప్రవర్తిం చేలా కొమ్ములు తెస్తుంది. కార్పొరేట్‌ మీడియా ఈ భావాన్ని మళ్లీ మళ్లీ సృష్టిస్తూ దాన్ని మామూలు విషయంగా మార్చేసి ఇప్పుడున్న వ్యవస్థీకృత వాతావరణాన్ని కొనసాగించే పరిస్థితులు కల్పిస్తుంది. మీడియా యాజమాన్యాలలోనూ సమాచార భావజాల రంగంలోనూ ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్యం వుండతగదు. ఈ రంగంలో ఆధిప త్యం వహించే చిరు బృందాలు ఇబ్బందికరమైన ఆలోచనలను చిదిమివేస్తాయి. తమ భాగ్యరేఖలను పెంచే విధానాలనే ప్రోత్సహిస్తాయి.

మోడీ ప్రభుత్వంలో ప్రస్తుత పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్‌ సింగ్‌, అలాగే ప్రస్తుతం ఆరోపణల పాలైన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తమ సంభాషణలను పత్రాలకెక్కించారు. నిజంగా ఏమి జరిగిందీ, దానికి ప్రేరణ ఏమిటి అన్నది తెలియాలంటే సరైన విచారణ ద్వారానే సాధ్యమవుతుంది. అయితే అదంతా జరిగింది 2014, 2016, 2017, 2019లలో…దాదాపు ఒక దశాబ్ది తర్వాత ఎప్‌స్టీన్‌ స్వయంగా తన ఘోర నేరాలను అంగీ కరించాడు. ఇక్కడ నిజమేమిటో బయటికి లాగడానికి మనం పట్టుదలగా కృషి చేయాలి. మానవాళికే వ్యతిరేకమైన ఇలాంటి నేరాలు జరిగేందుకు అనుమతిస్తున్న వ్యవస్థాగత మౌలిక చట్రం అంతర్జాతీయ ప్రభావం ఎదుర్కొనేందుకు మనం సిద్ధం కావాలి.
(ఫిబ్రవరి17 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -