ఆదర్శ పాఠశాల అండ్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు
నవతెలంగాణ-నెల్లికుదురు
టీజీఎంఎస్ & జూనియర్ కళాశాల, నెల్లికుదురు నందు 6వ తరగతి, 7వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సులలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయాన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ టి జి ఎం ఎస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కావలసిన వసతులు అన్ని ఉన్నాయని ఇందులో నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు మిగిలిన సీట్లకు రేపు మరియు ఎల్లుండి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడనున్నాయి అని అన్నాడు.
ఇంటర్మీడియట్ బాలికలకు హాస్టల్ సౌకర్యం కలదు. హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉన్నందున జిల్లాలోని ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందవచ్చు.సీట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి గల విద్యార్థినులు మరియు విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రేపు లేదా ఎల్లుండి పాఠశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్ పొందవలసిందిగా కోరడమైనది. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్: 9866935695 నెంబరు సంప్రదించాలని కోరడమైనది అని తెలిపారు.



