- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల టాయిలెట్ల మరమ్మతు పనుల్లో నాసిరకం, పాత టైల్స్‌ను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో చేపడుతున్న పనుల నాణ్యతపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పనులను పరిశీలించి, నాణ్యమైన సామగ్రితో నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



