Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విగ్రహాల పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టొద్దు 

విగ్రహాల పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టొద్దు 

- Advertisement -

వ్యాపారుల సంఘం మండల అధ్యక్షులు గంజి కృష్ణ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

జాతీయ నాయకుల విగ్రహాలకు మండల చిరు వ్యాపారులు వ్యతిరేకులు కారని డబ్బాలను తొలగించి విగ్రహాలు పెట్టడంతో పేద ప్రజల జీవనాధారం కోల్పోతారని, డబ్బాలను తొలగించకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాపార సంఘం మండల అధ్యక్షులు గంజి కృష్ణ అధికారులను కోరారు. డబ్బాలను తొలగించవద్దని  శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం కొరకు ర్యాలీ నిర్వహించారు.

సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు గంజి కృష్ణ మాట్లాడుతూ.. చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. డబ్బాలను తొలగించాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో చిరు వ్యాపారులు ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు సమయం ఇచ్చి డబ్బాలను ఏర్పాటు చేసుకోవడానికి మండల కేంద్రంలో స్థలం చూయించినంక తొలగించాలని కోరారు. అనంతరం ప్రజావాణిలో ఎం పి ఓ రాజశేఖర్ రెడ్డి, ఉప తహసిల్దార్ రవి కాంతుకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ సుదర్శన్, వ్యాపార సంఘం మహిళా సభ్యులు హైమావతి, పద్మ , రాధా, భాగ్యలక్ష్మి, నాయకులు రవీందర్, నరసింహ, జహీర్, శ్రీనివాసులు, మథిన్, నగేష్, రాజేష్, బుజ్జయ్య గౌడ్, మల్లేష్,, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -