హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా 'దీవాన. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు.
ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ, ‘మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మాలాంటి యంగ్ టీమ్ కు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మీకు మా మూవీ నచ్చకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ప్రైజ్ 100 రూపాయలు చేస్తున్నాం. మల్టీప్లెక్స్ ల్లో కూడా ఒక రేట్ ప్రకటిస్తాంఅని అన్నారు. ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ,'మా మూవీ టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకుంటున్న వారికి 18 ఫ్లస్ అని చూపిస్తోంది. అది చూసి వాళ్లు ఏముందో అని భయపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లగా చెబుతున్నా. ఫ్యామిలీ మెంబర్స్ తో ధైర్యంగా చూసే సినిమా మేము చేశామని గర్వంగా చెప్పగలను అని తెలిపారు.
‘మా సినిమాకి ఆదరణ ఆగదు. శతదినోత్సవం దాకా వెళ్తుంది. అయితే మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు` అని దర్శకుడు చెప్పారు.
అయినా.. ‘ఏసర్టిఫికేట్ ఇచ్చారు
- Advertisement -
- Advertisement -



