Tuesday, June 23, 2026
E-PAPER
Homeఆటలుహ్యారీ బ్రూక్‌ సారథ్యంలోనే!

హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోనే!

- Advertisement -

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టు
లండన్‌ :
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్‌ బృందానికి యువ నాయకుడు హ్యారీ బ్రూక్‌ కెప్టెన్సీ వహించనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడుతోంది. ఆఖరు టెస్టు ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. టెస్టు జట్టులో వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్న హ్యారీ బ్రూక్‌కు తొలి రెండు టీ20లకు విశ్రాంతి లభిస్తుందని అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్‌ సెలక్టర్లు హ్యారీ బ్రూక్‌నే ఐదు టీ20లకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఇంగ్లాండ్‌ జట్టులో ససెక్స్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. జోర్డాన్‌ కాక్స్‌, సకిబ్‌ మహమూద్‌, సోనీ బేకర్‌లు జట్టులోకి రాగా.. బెన్‌ డకెట్‌పై వేటు పడింది. జెమీ ఓవర్టన్‌ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌,ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ జులై 1 న చెస్టర్‌లీ స్ట్రీట్‌లో షురూ కానుంది. జులై 4న ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో, 7న ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో, 9న బ్రిస్టోల్‌లో, 11న సౌథాంప్టన్‌లో చివరి 4 మ్యాచులు జరుగుతాయి. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత జట్టును ఇదివరకే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టు :
హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జోఫ్రా ఆర్చర్‌, సోనీ బేకర్‌, టామ్‌ బాంటన్‌, జాకబ్‌ బెతెల్‌, జోశ్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), జేమ్స్‌ కోల్స్‌, జోర్డాన్‌ కాక్స్‌, శామ్‌ కరణ్‌, లియాం డాసన్‌, విల్‌ జాక్స్‌, సకిబ్‌ మహమూద్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, జోశ్‌ టంగ్‌, ల్యూక్‌ వుడ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -