Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్

హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్

- Advertisement -

ఉప సర్పంచుల ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-నసురుల్లాబాద్ 

నసురులాబాద్ మండల కేంద్రంలో మంగళవారం ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కర్ణం భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చలో సర్పంచ్ చలో హైదరాబాద్ అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్” కార్యక్రమాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టనున్న ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్నాలో ప్రధానంగా ఉప సర్పంచులకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉప సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచులకు సర్పంచులతో సమాన హక్కులు, అధికారాలు కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహించే ధర్నాకు ఉప సర్పంచులు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాన్సవాడ నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరం ఇన్‌చార్జి సంజీవ్, ఉప సర్పంచులు చౌదరి, రామ్మోహన్, నాయకులు శివదయాల్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -