Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప సర్పంచ్‌ల హక్కుల సాధనకై నేడు ‘చలో హైదరాబాద్’

ఉప సర్పంచ్‌ల హక్కుల సాధనకై నేడు ‘చలో హైదరాబాద్’

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : ఉప సర్పంచ్‌ల హక్కుల సాధనకై నేడు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని ఉప సర్పంచ్‌ ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం అయన విలేకరుల తో మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్ష ణ, న్యాయ డిమాండ్ల సాధన కోసం నేడు గురువా రం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న “హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్” అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌పై వస్తున్న ప్రచారాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచ్‌లకు నెలకు రూ.5 వేలు, వార్డ్ సభ్యులకు రూ.3 వేలు గౌరవ వేతనం ప్రకటించాలని కోరారు. స్థానిక సంస్థ ల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ ధర్నాకు తొగుట మండలం ఉప సర్పంచ్‌ లు, వార్డ్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -