Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓయూ ఈఎమ్ఆర్ సిలో మానవ రహిత స్టూడియో

ఓయూ ఈఎమ్ఆర్ సిలో మానవ రహిత స్టూడియో

- Advertisement -

టెక్నాలజీ తో ప్రపంచ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ స్టూడియో.
మూక్స్, స్వయంప్రభ, సీసీఈ రుసా సహా ఇతర సంస్థలకు అందించనున్న ఆడియో విజువల్స్.
60 మందితో డిజిటల్ క్లాస్ ,లైవ్ టెలికాస్ట్ సౌకర్యం.
ఫ్లైయింగ్ లైటింగ్ గ్రీడ్, ఫుల్ హెచ్డీ, 4కె. పి టి జెడ్ కెమెరాలు.

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ:
ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎడ్యుకేషన్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ ( ఈ ఎం ఆర్ సి ) ఆడియో విజువల్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు దక్కుంచుకుంటోంది. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మార్గదర్శకత్వంలో కొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. వీసీ ప్రొఫెసర్ కుమార్ నాయకత్వం, సహకారం సలహాలతో ఈఎంఆర్సీ డైరెక్టర్ పి. రఘుపతి ఈఎంఆర్సీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గతంలో నామ్కే వాస్తుగా ఉన్నా ఈ సంస్థ. రఘుపతి బాధ్యతలు స్వీకరించాక నూతన టెక్నాలజీ అందిపుచ్చుకొని దేశం లో ఉన్న అన్ని ఈ ఎం ఆర్ సి లకు దీటుగా ముందు వరుసలో దూసుకెళ్తుంది. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈఎంఆర్సీ స్టూడియోను సుమారు 45 లక్షల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో ఆధునికరించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన డిజిటల్ స్టూడియోను జూన్ 20న ప్రారంభించారు. ఓయు వీసీ ప్రొ.ఎం. కుమార్, కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీ, డైరెక్టర్ ప్రొ. పరీక్షత్ సింగ్ మన్హాస్, యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ జితేంద్ర కుమార్ త్రిపాఠి, ఓయూ రిజిస్టర్ ప్రొ. నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొ. జితేంద్రకుమార్ నాయక్, డీన్ యుజిసి ప్రొ. బి. లావణ్య చేతుల మీదుగా అధునాతన స్టూడియోను ప్రారంభించారు.

ప్రత్యేకతలు అనేకం :- ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక సాంకేతకతను జోడించి స్టూడియో ను పునరుద్దరించారు. స్టూడియో లైటింగ్ రంగంలో పేరున్న కెనరా లైటింగ్ సంస్థ…. ఫ్లయింగ్ లైటింగ్ గ్రిడ్ ను ఏర్పాటు చేసింది. ఈ గ్రిడ్ ద్వారా స్టూడియోలో ఏ మూలన ఉన్న ఖచ్చితమైన లైటింగ్ అందజేస్తుంది. విజువల్ క్లారిటీకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అవసరాన్ని బట్టి కింది నుంచి 20 అడుగుల వరకు లైటింగ్ గ్రిడ్ ను రిమోట్ తో ఆపరేట్ చేయవచ్చు. గ్రిడ్ లోని ప్రతి లైట్ ను పీసీఆర్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం డీఎంఎక్స్ కంట్రోలర్ ఏర్పాటు చేశారు. మానవ వనరులతో సంబంధం లేకుండా స్టూడియోను పూర్తిగా ఆటొమేటెడ్ చేశారు. కెమెరామెన్లతో సంబంధం లేకుండానే రికార్డు చేసే కెమెరాలను ప్రఖ్యాత కంపెనీ కెనాన్ ఎన్ 500 పి.టి.జెడ్ కెమెరాలను అమర్చింది. ఈ కెమెరాల నిర్వహణకు ఎలాంటి కెమెరామెన్ అవసరం లేదు. ఏక కాలంలో 8 కెమెరాలు ఆపరేట్ చేసే విధంగా….. సత్వరమే ఆన్లైన్ లోనే ఎడిటింగ్ చేసుకునే విధంగా మొత్తం సెటప్ ఏర్పాటు చేశారు. విశాలమైన గ్రీన్ స్క్రీన్ వలన పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ లో క్రోమోకు సులభంగా ఉంటుంది. ఈ స్టూడియోలో గ్రూపు చర్చలు, పాడ్కాస్టింగ్ , ఇంటర్వ్యూలు , డిజిటల్ క్లాస్ రూం, ఇతర ప్రత్యేక తరగతుల నిర్వహణకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ఆధునిక 4కె పి టి జెడ్ కెమెరాల వలన మానవుల అవసరం లేకపోగా… మరింత స్పష్టత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సౌండ్ ప్రూఫ్ తో ప్రత్యేకంగా తయారు చేయబడిన డిజిటల్ స్టూడియో వలన ఆడియో క్లారిటీగా రికార్డింగ్ చేయవచ్చు.

టెలి ప్రామ్టర్ వలన ఈ స్టూడియోలో పాఠాలు బోధించడం సబ్జెక్టులకు అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా మానవ రహితం కావడంతో, ఎలాంటి పాఠ్యాంశాలను అయినా సులభంగా బోధించవచ్చు. గ్రీన్ మ్యాట్ తో తీసిన వీడియోలకు ఎడిట్ లో అవసరమైన అత్యుత్తమ క్లిప్స్ తో జోడించవచ్చు. 60 మందితో డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటుగా లైవ్ టెలికాస్ట్ ను చేసుకునే సౌకర్యం ఉంది. ఈ డిజిటల్ స్టూడియో ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే స్వయం “మూక్స్” “స్వయంప్రభ ” డీటీహెచ్ ఛానళ్లకు అసరమైన పాఠాలు రూపొందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కు “రుసా” కింద డిజిటల్ పాఠాలు రూపొందిస్తున్నారు. త్వరలోనే దూరవిద్య విద్యార్థులకు ఉపయోగపడే డిజిటల్ పాఠాలు కూడా రూపొందించేందుకు ఈఎంఆర్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఓయూ అనుమతి తో డిజిటల్ రంగంలో ప్రత్యేక నైపుణ్యాల అభివృద్ధి కోసం సర్టిఫికెట్ కోర్సులు రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈఎంఆర్సీ డైరెక్టర్ పి. రఘుపతి తెలిపారు. ఇక్కడ ఇతర సంస్థలు కూడా ప్రత్యేక రుసుమును చెల్లించి రికార్డింగ్ కోసం స్టేడియోలోని సదుపాయాలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. స్టూడియో ఉస్మానియా యూనివర్సిటీ కే కాకుండా దేశంలో ఉన్న అన్ని ఈఎంఆర్సి లతో పోలిస్తే… ప్రత్యేకంగా ఉంటుందని రఘుపతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -