Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం

పరకాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) మరియు స్థానిక తహసీల్దార్ హాజరై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) మరియు బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకోవాలని, ఎన్యూమరేషన్ ఫారాన్ని పొంది అందులో అడిగిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి సంబంధిత బీఎల్ఓకు అందజేయాలని అధికారులు సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సహకరించాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -