Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ విద్యార్థులకు తక్షణమే నోట్ బుక్స్, దుప్పట్లు ఇవ్వాలి

హాస్టల్ విద్యార్థులకు తక్షణమే నోట్ బుక్స్, దుప్పట్లు ఇవ్వాలి

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం. తారా సింగ్
నవతెలంగాణ-అచ్చంపేట
సంక్షేమ హాస్టల్ లలో విద్యార్థులకు తక్షణమే నోట్ బుక్స్, పెట్టలు, గ్లాసులు దుప్పట్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన  చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం. తారా సింగ్ మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా  విద్యార్థులకు నేటికీ నోట్ బుక్స్, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు పాఠశాలలో  సిలబస్ ప్రారంభమై విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందన్నారు.

కొంతమంది విద్యార్థులు తమ సొంత డబ్బులతో నోటుబుక్స్ కొనుగోలు చేస్తున్నారు. విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. దాదాపు గత సంవత్సర కాలం నుండి విద్యార్థులకు కాస్కోటిక్ చార్జీలు ఇవ్వట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. తక్షణమే విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు దుప్పట్లు, పెండింగ్లో ఉన్న కాస్మోటిక్  ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు చరణ్, కార్యదర్శి రమేష్, కమిటీ సభ్యులు రవి, సురేష్, చందర్ బాబు, తరుణ్, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -