Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు  

యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
యువత, విద్యార్థులు డ్రగ్స్, మత్తుమందులు, గంజాయి మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఆలేరు సీఐ యాలాద్రి అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం బస్టాండ్ సమీపంలో ప్రజలకు డ్రగ్స్ బారిన పడొద్దని స్థానికులకు అవగాహన కల్పించారు. జూన్ 26 అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ యాలాద్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు, యువకులు, ఆటో డ్రైవర్లు,  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -