Friday, June 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్- అమెరికా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్

భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్

- Advertisement -

ముగుస్తున్న సుంకాల గడువు
తాజా చర్చల్లోనూ నో క్లారిటీ!
మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు

వాషింగ్టన్ : భారత్- అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రెండు దేశాలు డీల్‌ను ఖరారు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒప్పందం ఒక కొలిక్కిరావట్లేదు. ఇప్పుడు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మధ్య రెండు రోజుల పాటు ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. మార్కెట్ యాక్సెస్, డిజిటల్ ట్రేడ్, వ్యూహాత్మక రంగాల్లో సహకారం వంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిం చారు. రెండు దేశాలు రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపినప్ప టికీ మరి రెండు దేశాల మధ్య విభేదాలు పూర్తిగా పరిష్కారమయ్యాయా లేదా అనే అంశంపై స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. అమెరికా ప్రస్తుతం విధిస్తున్న 10 శాతం తాత్కాలిక టారిఫ్స్ గడువు జులై 24తో ముగియనుండటంతో డీల్ ఎప్పుడు జరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. చర్చల అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో మధ్యంతర ఒప్పందాన్ని పూర్తి చేసే మార్గాలపై చర్చించినట్లు తెలిపింది. ఈ వివరాల ప్రకారం- ఒప్పందానికి
సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మార్కెట్లలోకి సులభతర ప్రవేశం, డిజిటల్ వాణిజ్యం, గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థ బలోపేతం, నాన్ టారిఫ్ బారియర్స్, వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు బృందాలు సుదీర్ఘంగా చర్చించాయి. రెండు దేశాల వ్యాపారులు, కార్మికులు, రైతులు, వినియోగదారులకు స్పష్టమైన ప్రయో జనాలు చేకూరేలా సమతుల్యమైన, వాణిజ్యపరంగా ప్రయోజనకరమైన తాత్కాలిక ఒప్పందం కుదుర్చు కునేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు రెండు దేశాలు పునరుద్ఘాటించాయి.

ఏఐలో ముందుకెళ్లాలని చూస్తున్న భారత్- జేమిసన్ గ్రీర్
అంతకుముందు సోషల్ మీడియా వేదికగా స్పందించిన పీయూశ్ గోయల్, భారత్- అమెరికా వాణిజ్య చర్చల పురోగతిని సమీక్షించినట్టు చెప్పారు. నిర్మాణాత్మక, దూర దృష్టితో చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యవసాయం, తయారీ రంగాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశమని, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలనే ఆసక్తి చూపుతోందని అన్నారు. ఈ రంగాల్లో ఇరు దేశాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఈ చర్చలకు మరింత ఊతమిస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు సమావేశమై భారత్- అమెరికా సంబంధాల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు గ్రీర్ వెల్లడించారు. కానీ ట్రంప్..మోడీ మధ్య సానుకూలమైన చర్చలు జరగలేదని స్పష్టమైంది.

సుప్రీం కోర్టు తీర్పుతో 10 శాతం సుంకాలు అమల్లోకి!
భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు 2025, ఫిబ్రవరి 13న అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. తర్వాత అమెరికా సుప్రీం కోర్టు- ట్రంప్ సర్కార్ విధించిన భారీ సుంకాల్ని రద్దు చేయడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో అమెరికా- ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122 కింద అన్ని దేశాల దిగుమతులపై తాత్కాలికంగా 10 శాతం సుంకం విధించింది. ఫిబ్రవరి 24 న ఇది అమల్లోకి రాగా జులై 24తో ముగియనుంది. ఈ గడువు ముగిశాక అమెరికా సెక్షన్ 301 దర్యాప్తుల ఆధారంగా పలు దేశాలపై కొత్త సుంకాల్ని విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కూడా ఈ దర్యాప్తుల పరిధిలో ఉండటంతో వాణిజ్య ఒప్పందాన్ని ఆలోపే త్వరగా పూర్తి చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఈ కాలంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల విలువ ఏకంగా 87.3 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 52.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక్కడ వాణిజ్య మిగులు 40.89 బిలియన్ డాలర్ల నుంచి 34.4 బిలియన్ డాలర్లకు తగ్గింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -