Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు

వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదిక కార్యలయంలో శుక్రవారం వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రైనింగ్ అధికారులు వార్డు సభ్యులకు స్థానిక సంస్థల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాజ్ కిరణ్ రెడ్డి, ట్రైనింగ్ అధికారులు, వార్డు సభ్యులు, ఎంపిడిఓ కార్యలయ ఈ పంచాయతి ఆపరేటర్లు నరేంధర్, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -