Friday, June 26, 2026
E-PAPER
Homeఆటలుఅతని తొందరగా ఔట్ చేస్తాం: ఐర్లాండ్ కెప్టెన్‌

అతని తొందరగా ఔట్ చేస్తాం: ఐర్లాండ్ కెప్టెన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 సిరీస్‌ భాగంగా బెల్‌ఫాస్ట్‌ వేదికగా నేడు టీమిండియా- ఐర్లాండ్‌ ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళ్లన్నీ భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపైనే ఉన్నాయి. శుక్రవారం యువకెరటం పిడుగు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐర్లాండ్ కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడు. ఈ వారంలోనే అతడు తమపై అరంగేట్రం చేయవచ్చు. అతడి కెరీర్‌లోనే ఇదొక గొప్ప రోజు అవుతుంది’’ అని టక్కర్‌ వైభవ్‌ను కొనియాడాడు. అయితే, అదే సమయంలో..  ‘‘వైభవ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపి అతడి సంతోషాన్ని చెడగొట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తామని మీడియా తో అన్నారు.

ఇక ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్‌ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్‌ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -