నవతెలంగాణ-మద్నూర్
ఈ నెల 28 (ఆదివారం) నుంచి 0-5 ఏండ్ల లోపు చిన్నారులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శ్రీలేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డోంగ్లీ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఐదేండ్లలోపు పిల్లలు దాదాపుగా 4486 మంది ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఆదివారం గ్రామాలలోని బూత్ కేంద్రాలలో పోలీయో చుక్కలు వేస్తారని చెప్పారు. అదేవిధంగా 29, 30 తేదీలలో ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వచ్చి వేస్తారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రులలో పాటు బస్టాండ్ లలో కూడా పోలీయో చుక్కలు వేసే సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. 0-5 ఏండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలీయో చుక్కలు వేయించి, భవిష్యత్తులో పోలీయో, తదితర వ్యాధులు దరి చేరకుండా పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ సహరించాలని సూచించారు.
ఈ నెల 28 నుంచి పోలీయో చుక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



