- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ, ఆలేర్ పట్టణంలో శుక్రవారం రాజ్యాధికార సమరభేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పసుల ప్రసన్న సమక్షంలో స్థానిక నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భువనగిరి సమరభేరి సభకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్బండ వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు చింతపండు వెంకటేష్, చెక్క రవి, ఉపాధ్యక్షులు కొండ పరమేష్, పసునూరి శ్రీహరి, ఆలేటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



