Saturday, June 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివికలాంగుల స్ఫూర్తి ప్రదాత ‘హెలెన్ కెల్లర్’

వికలాంగుల స్ఫూర్తి ప్రదాత ‘హెలెన్ కెల్లర్’

- Advertisement -

సమాజంలో నిర్లక్ష్యం చేయబడుతున్న వికలాంగులతో పాటు ప్రజలకు హక్కుల ు సాధించేందుకు, వారిని చైతన్యం చేసేందుకు పరితపించిన యోధురాలు హెలెన్ కెల్లర్. ఆమె పుట్టుకతో చెవిటి, అంధురాలు. అయినప్పటికీ కవి, రచయితగా పౌర హక్కుల కోసం పోరాడిన ధిశాలి. ఎనభయ్యవద దశకంలో జన్మించిన ఆమె రెండేండ్ల వయసున్నప్పుడు మేనిజైటిఎస్ వ్యాధి వలన తీవ్రమైన అనారోగ్యం వలన చెవిటి, అంధురాలిగా మారారు. హెలెన్ కెల్లర్ చాలా చురుకైనా, తెలివైన వారు.స్వర్ష, వాసన ద్వారా పరిసరాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగారు. అలెగ్జాండర్ గ్రహంబెల్ సలహాతో పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ హెలెన్ కెల్లర్ చేరారు. అన్నే సుల్లివన్ అనే ఉపాధ్యా యురాలి పర్యవేక్షణలో హెలెన్ కెల్లర్‌కు చేతివేళ్లతో అక్షరలు చూపిస్తూ సంభాషణ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఆమెలో ఉన్న పట్టుదలనే ఆమెను ప్రపంచ దేశాలు పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చే వి‌ధంగా మార్చింది.హెలెన్ కెల్లర్ బ్రేయిలి చదవడం నేర్చుకుని రాడ్క్లిఫ్ కాలేజీ అఫ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి 1904లో డిగ్రీ పట్టభద్రులయ్యారు. ప్రపంచంలోనే బ్యాచిలర్ అఫ్ ఆర్ట్స్ పట్టా పొందిన మొదటి చెవిటివ్యక్తి హెలెన్ కెల్లర్.

వికలాంగులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని, సమాన హక్కుల సాధన కోసం పోరాడారు. ఆమె జీవిత కాలంలో వందలాది వ్యాసాలు, ప్రసంగాలు చేయడంతో పాటు 14 పుస్తకాలను రాశారు. 22 ఏండ్ల వయస్సులోనే ‘ది స్టోరీ అఫ్ మై లైఫ్’ పేరుతో ఆత్మకథ రాశారు. అమెరికాన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ను స్థాపించి కార్మికులు తమ హక్కుల కోసం, మెరు గైన వేతనాలు, సౌకర్యాల కోసం జరుగుతున్న పోరాటల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హెలెన్ కెల్లర్ శ్వేత జాతీయుల ఆధిపత్యం, హత్యలకు వ్యతిరేకంగా నిలబడింది. పేదరికం, అణచివేతల కారణంగానే సమాజంలో వైకల్యం ఏర్పడుతుందని తన పరిశోధనల గుర్తించారు. అందత్వం, పోషక ఆహార లోపానికి కారణమైన అంశాలపై పోరాడేందుకు హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించారు. అమెరికన్ పౌండేషన్ ఫర్ ది బ్లైండ్ సంస్థ కోసం నలభైఏండ్ల పాటు విరాళాలు సేకరించారు.
ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాల్లో 110కోట్ల మంది పేదరికంలో ఉండగా, ఇండియాలో అత్యంత పేదరికంలో 7.50 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో 150 కోట్ల మందికి ఎదో ఒక రకమైన వినికిడి లోపం ఉంటే 43 కోట్ల మందికి తీవ్రమైన వినికిడిలోపం ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 50.7 లక్షల మందికి, తెలంగాణలో 1.1 లక్షల మందికి వినికిడి లోపం ఉంది. దేశంలో 49.5 లక్షల మందికి పూర్తి అందత్వం ఉంటే 7 కోట్ల మందికి ఏదో ఒక రకమైన దృష్టి లోపం ఉంది. మన రాష్ట్రంలో 2.1 లక్షల మందికి ఉంది. వినికిడి, దృష్టిలోపాన్ని నిర్ములించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ టీచర్స్ నియమించడంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియమించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రపంచ వ్యాప్తంగా హెలెన్ కెల్లర్ వికలాంగుల హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారు. వికలాంగుల సాధికారతకు చిహ్నంగా నిలిచారు. హెలెన్ కెల్లర్ జీవితం ప్రజలకు పట్టుదల, ఆత్మవిశ్వాసం,విద్యా ప్రాధాన్యతల గురించి సమాజానికి సందేశం ఇస్తుంది. తీవ్రమైన అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆమె సాధించిన విజయాలు నేటితరం వికలాంగులకు ప్రేరణగా నిలుస్థాయి. ఆమె జయంతి సందర్భంగా సమాజంలో వికలాంగుల పట్ల గౌరవం, సమానత్వం, సానుభూతి కాకుండా వికలాంగుల హక్కుల పరిరక్షణకోసం, విద్యా, ఉపాధి అవకాశల కోసం, సమగ్ర, సమాన అవకాశలు సాధించేందుకు పోరాటాలకు సిద్ధం కావలసిన బాధ్యత వికలాంగులపై ఉంది. (నేడు హెలెన్ కెల్లర్ 146వ జయంతి)

యం.అడివయ్య, 9490098713

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -