Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ తెలిపారు. శనివారం జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నావాతే ప్రతాప్ మాట్లాడుతూ..  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు(ఎం పి) ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈ నెల 30 తారీఖున రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్లు ఫీజు రివర్స్మెంటు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కళాశాల యాజమాన్యాలు సంబంధించిన ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయకుండా కాలేజ్ యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేస్తామని హెచ్చరించడం సరికాదు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, జనార్దన్, శ్రీను, అరవింద్, కిరణ్, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -