నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలోని పెద్ద తడ్గురు గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియలో గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న, ఉప సర్పంచ్ హనుమగౌడ్, వార్డు సభ్యులు కలిసి ఆదివారం ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్ బి ఎల్ ఓ లతో సర్పంచ్ మాట్లాడుతూ.. ఓటర్ సవరణ ప్రక్రియ జాగ్రత్తగా చేపట్టాలని ఎలాంటి సమస్య వచ్చినా సర్పంచ్ దృష్టికి గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పంచాయతీ పాలకవర్గం ఎల్లవేళల కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అపోహలు ఉన్నాయని ఎందుకంటే ఓట్లు తొలిగిపోతాయేమోనని భయం వారిలో ఉండటం అలాంటి సమస్య రాకుండా ప్రతి ఒక్కరి ఓటు తప్పిపోకుండా జాగ్రత్త వహిస్తూ ఓటర్లందరికీ సహాయ సహకారాలు అందించగలరని బి ఎల్ ఓ లకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.



