Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ జానకి 

సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ జానకి 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
జులై 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలానికి రానున్న సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో సీఎం సభ స్థలాన్ని స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఎస్పీ జానకి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి గ్రామంలోకి వెళ్లే రహదారులు చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను పంచాయతీ అధికారులు తొలగించారు. 

విద్యుత్ ఉప కేంద్రంలో ఆవరణ లో మహనీయుల విగ్రహాల ఏర్పాటులో భాగంగా రహదారిపై ఉన్న డబ్బాలను డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, సీఐ  కమలాకర్, ఎస్సై శ్రీనివాసులు సమక్షంలో తొలగించారు. డబ్బాలను తొలగించడంతో చిరు వ్యాపారులు తమ బ్రతుకుతెరువును రోడ్డుపై వేశారని వాపోయారు. ప్రభుత్వం తమకు ప్రత్యేకంగా స్థలం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య ,బాల్ రెడ్డి, సర్పంచి ఎడ్ల శంకర్, మల్లికార్జున రెడ్డి, గౌస్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -