నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగావ్ జపి గ్రామంలో ఓటర్ల సమగ్ర ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ యువకులు, మండల బిజేపి పార్టీ అధ్యక్షుడు మేత్రి బాలాజీ అన్నారు. ఆదివారం గ్రామం లో సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి కార్యక్రమం విజయవంతం చేసేందుకు యూత్ నాయకులు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గ్రామంలో అరుహులైన వారందరికీ ఫారాలు బిఎల్ఓ లు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఫారాలలో నమోదు చేయాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇస్తే ఓటర్ జాబితా నుండి తొలగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
లాడేగావ్ లో సర్ ప్రక్రియలో పాల్గొన్న యువకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



