Monday, August 31, 2026
E-PAPER
Homeదర్వాజఘోర ఘటన

ఘోర ఘటన

- Advertisement -


రాజధాని లఖ్న పూలో ఘోరం
వాణిజ్య భవన్ మృత్యు గహ్వరం
అగ్ని కీలలలో పామరుల సజీవ దహనం
తల్లి దండ్రులకు తీరని గర్భశోకం
బతుకు బాటకై ఆశ్రయించిన కేంద్రం
కబళించెను భావి పౌరుల జీవనం
ఉత్తర ప్రదేశ్ లో సంఘటన
భయం భ్రాంతి కరం
అయోధ్య రాముడిలో విషన్న వందనం
దేశనాయకులు దిగ్భ్రాంతి చెందడం
కన్నీరు మున్నీరైన అశేష ప్రజానీకం
యజమాని అజాగ్రత్త వల్లే ఈ ప్రారబ్దం
పాలకులు కళ్ళు తెరవకుంటే ఇదే మృదంగం పరిహారాలతో తీరదు దుఃఖం
కన్నవారి జీవితమంతా కన్నీటి సాగరం
ఏదేవతలు తీర్చలేని హృదయ వేధనం
డబ్బుపై వ్యామోహమే పెను ప్రమాదం
నమిల కొండ నాగేశ్వర్ రావు, 8688553470

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -