నవతెలంగాణ – దర్పల్లి
ఇటీవల కాంగ్రేస్ పార్టీ అధిష్టానం నూతన మండలాల అధ్యుక్షుల ఎంపీక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దర్పల్లి మండల అధ్యక్షునిగా మండలంలోని చల్లగార్గ గ్రామ సర్పంచ్ గాదె నరేష్ ను అధిష్టానం నియమించింది. ఈ సందర్బంగా సోమవారం మండల కేంద్రములోని సొసైటీ ఆవరణలో ఆయనను కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు గాదె నరేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు. అందరిని కలుపుకొని పార్టీ బలోపేతనికి కష్టపడి పని చేస్తానని చెప్పారు. భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు శక్తివంచనలేకుండా పనేచేస్తానని అన్నారు.
ఈ అవకాశం కల్పించిన పార్టీ పెద్దలు పిసిసీ అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, ముఖ్యనంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, మండల కాంగ్రేస్ పార్టీ నాయకులకు, అన్ని గ్రామాలు సర్పంచులకు, కార్యకర్తలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ మాట్లాడుతూ.. పార్టీ కొరకు పనిచేసేవారికి తప్పకుండ పదవులు దక్కుతాయని అన్నారు. మండలంలో బిసి సామాజిక వర్గానికి చెందిన యువకుడు నరేష్ కు మండల బాధ్యతలు అప్పగించడంపై ఆయన హర్షం వెక్తం చేశారు. నరేష్ నియామకం పట్ల మండల కాంగ్రేస్ శ్రేణుల్లో నూతన ఉత్తెజం నెలకొని ఉందని అన్నారు.
కార్యక్రమములో జిల్లా నాయకులు చెలిమేల నర్సయ్య, మనోహర్ రెడ్డి,సొసైటీ చేర్మెన్ మల్లికార్జున్, అయ్యాగ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, చేలిమేల శ్రీనివాస్, ఎజ్జా శ్రీకాంత్, రాజేందర్, నల్ల సుదర్శన్, మాలవత్ రమేష్ గుడి తండా, బాలు, మంగీత్య నాయక్, చంద్రశేఖర్, పోష గౌడ్,సుదర్శన్ గౌడ్, బంగ్లా భూమన్న, తదితరులు పాల్గొన్నారు.



