- Advertisement -
సత్వర పరిష్కారానికి అధికారుల ఆదేశం
నవతెలంగాణ – పరకాల
రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 8 అర్జీలు అందాయి. ఆర్డీఓ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసిన ఆర్డీఓ, ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, బాధ్యతాయుతమైన పరిష్కారాలు చూపాలని ఆయన సూచించారు.
- Advertisement -



