Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేపర్ లీకేజీ వివాదం: విద్యార్థియువజన పోరాటానికి సీపీఐ(ఎం) సంఘీభావం

నీట్ పేపర్ లీకేజీ వివాదం: విద్యార్థియువజన పోరాటానికి సీపీఐ(ఎం) సంఘీభావం

- Advertisement -

న్యూఢిల్లీ: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, దేశంలో విద్యా వ్యవస్థ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, సీనియర్ నాయకురాలు బృందాకరత్ ఈరోజు జంతర్ మంతర్ ను సందర్శించి, నిరసనకారులకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ పర్యటనలో వారి వెంట ఎస్ఎఫ్ఐ (SFI) జాయింట్ సెక్రటరీ ఐషే ఘోష్ సహా పలువురు విద్యార్థి నాయకులు ఉన్నారు.

ఈ సందర్భంగా బేబీ, బృందా కరత్‌లు.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో అక్కడ నిరాహార దీక్షకు కూర్చున్న ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త సోనమ్ వాంగ్ చూక్‌ను వారు పరామర్శించారు.

అనంతరం సీపీఐ(ఎం) నేతలు మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. పేపర్ లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం విద్యార్థులు, యువత చేస్తున్న ఈ పోరాటంలో సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని నేతలు భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -