Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్లో ఇండ్లకు పరిహారం ఇప్పించాలి

డేంజర్ జోన్లో ఇండ్లకు పరిహారం ఇప్పించాలి

- Advertisement -

సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు భూ నిర్వాసితుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసీపీ బ్లాక్-1కు 500 మీటర్ల  దూరం డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను సర్వే నిర్వహించి,పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇప్పించాలని సోమవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను భూ నిర్వాసితులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు.

డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు,ఇతర అవసరాల కోసం ఇటీవల జెన్కో కంపెనీ రూ.261 కోట్ల నిధులను రెవెన్యూశాఖకు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.వారం రోజుల్లోనే సర్వే టీమ్స్ పంపించి సర్వే కార్యక్రమాన్నీ చేపట్టేలా కాటారం ఆర్థిఓకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. అనంతరం కాటారం ఆర్డీఓకు సైతం కలిసి విన్నవించారు. ఆర్డీఓ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు దండు రమేష్,తాండ్ర మల్లేష్,దన్నపనేని రాజేశ్వరరావు,అశోక్ రావు,సురేష్ రావు,రామిడి గట్టయ్య,ఆర్ని సత్యనారాయణ, కేశారపు చెంద్రయ్య,బూడిద రాజసమ్మయ్య,గట్ల సత్యనారాయణ,అజ్మత్ అలీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -