నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటర్ జాబితా సవరణలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం, మహాదేవపూర్ ,మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు,(బిఎల్ఏ) సూపర్వైజర్లకు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియలో బిఎల్ఏ లు క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొని, ప్రతి బూత్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎలు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియపై బిఏల్ఏ, సూపర్వైజర్లకు శ్రీనుబాబు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



