Tuesday, June 30, 2026
E-PAPER
Homeసినిమానా జీవితం ఒక తెల్లకాగితం

నా జీవితం ఒక తెల్లకాగితం

- Advertisement -

‘గుప్తా మాణిక్యాలరావు, అట్లూరి పూర్ణచంద్రరావు, దాసరి నారాయణరావు, శోభన్‌ బాబుని నా జీవితంలో మర్చిపోలేను. ఆ నలుగురు నాకు చేసిన సహాయం మర్చిపోలేను. నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. నా జీవితం తెల్లకాగితం. నా జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు. సాయం చేయటం మాత్రమే తెలుసు. ఏదీ ప్రచారం చేసుకోనుఅని నటుడు, నిర్మాత మురళీ మోహన్ అన్నారు. తాజాగా ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించిన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిలిం ఛాంబర్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ బత్తుల ప్రసాద్‌ మాట్లాడుతూ,'మురళీ మోహన్‌ అసలు పేరు రాజాబాబు. ఆయనకు అవార్డు రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని అన్నారు.
‘నా విషయంలో కూడా మురళీ మోహన్ చాలా ఎంకరేజ్‌ చేశారు. ప్రతి సందర్భంలోనూ ఆయన నా వెంట ఉన్నారు. బావున్నప్పుడు ప్రతి ఒక్కరూ వెనక ఉంటారు. నేను చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మురళీ మోహన్‌ ప్రతి క్షణం వెన్నంటే ఉంటూ నన్ను ఎంతో ప్రోత్సహించారు` అని జనరల్‌ సెక్రటరీ సురేష్‌ కొండేటి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -