Tuesday, June 30, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం ఉత్కంఠభరితం

ఆద్యంతం ఉత్కంఠభరితం

- Advertisement -


వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం. రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ,'టైటిల్ చాలా బాగుంది. రాజవంశీ టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూ సర్స్ మంచి ప్రయత్నం చేశారు. డైరెక్టర్ విజన్ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. హీరో, హీరోయిన్, సినిమా టీమ్ కు అల్ ది బెస్ట్ అని అన్నారు. నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ,’డైరెక్టర్ కథ చెప్పగానే తప్పకుండా ఈ సినిమా చేయాలి అనిపించింది. చాలా అద్భుతంగా తీశారుఅని అన్నారు. 'మంచి కథ, కథనాలతో సినిమాని తెరకెక్కించాం అని మరో నిర్మాత కిషోర్ గుండాల చెప్పారు. దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ,’ప్రేమ, సస్పెన్స్ కలయికతో ఉత్కంఠ భరితంగా సినిమా ఉంటుంది` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -